Reading Time: < 1 minute
Priyanka Gandhi Criticizes Delimitation Move In Womens Reservation Bill Debate

Priyanka Gandhi: కేంద్రం ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ గురువారం మాట్లాడారు. మహిళా కోటా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, అయితే దీనిని అమలు చేయడానికి డీలిమిటేషన్ చేస్తుండటంపైనే తమ అభ్యంతరాలు ఉన్నాయని లోక్‌సభలో ఆమె అన్నారు. ఎన్నికల్లో పైచేయి సాధించడానికి ఇది ఒక రాజకీయ అస్త్రం అని ఆమె ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని దెబ్బతీయడానికి బీజేపీ తన పార్టీ పునాదులను బలోపేతం చసేుకుంటోందని ఆమె అన్నారు.

Read Also: Coconut Water: ఏ కొబ్బరి కాయలో నీళ్లు ఎక్కువగా ఉంటాయి.. ఈ చిన్న చిట్కాలతో కనిపెట్టవచ్చు..

ఇదిలా ఉంటే, చాణక్యుడిని ప్రస్తావిస్తూ ఆమె వేసిన సెటైర్లు సభలో నవ్వులు పూయించాయి. కేంద్రం హోం మంత్రి అమిత్ షా కూడా ప్రియాంకా వ్యాఖ్యలకు నవ్వారు. ‘‘మీరంతా పక్కా ప్లాన్‌తో వచ్చారు. ఈ రోజు గనుక చాణక్యుడు బతికి ఉంటే మీ కుయుక్తికి ఆయన ఆశ్చర్యపోయి ఉండేవారు.’’ అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలుకే అమిత్ షాతో పాటు మంత్రులు కిరెన్ రిజిజు నవ్వారు.

రాష్ట్ర ఎన్నికల సమయంలో హఠాత్తుగా పార్లమెంట్ ఏర్పాటు చేయడం, ఎన్నికలకు ఒక రోజు ముందే ముసాయిదా ముందుకు తేవడం, మహిళా అభ్యున్నతి కోసం మోడీ అతిపెద్ద నిర్ణయం తీసుకున్నారని మీడియాలో చర్చ జరిపించడం, ప్రతీ ఒక్కరూ ఆయనకు మద్దతు ఇచ్చేలా చేయడం, ఇలా ప్రతిపక్షాలను సందిగ్దంలో పడేయడం అంతా ప్లాన్ అంటూ ఆమె ఆరోపించారు.