Reading Time: < 1 minute
Mi Vs Pbks Rohit Sharma Ruled Out Due To Injury Playing Xi And Match Updates Is

MI vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌లో భాగంగా నేడు వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పొడిగా ఉన్నప్పటికీ, రాత్రి సమయంలో మంచు కురిసే అవకాశం ఉండటంతో ఛేజింగ్‌కే మొగ్గు చూపినట్లు అయ్యర్ తెలిపాడు. ప్రస్తుతం పంజాబ్ జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, అదే ఊపును కొనసాగించాలని భావిస్తోంది.

Jananayagan Leak: జననాయగన్ సినిమా లీక్ కేసులో ముగ్గురు కీలక నిందితుల అరెస్ట్..!

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో కొన్ని కీలక మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్ కారణాల దృష్ట్యా ఈ మ్యాచ్‌ కు అందుబాటులో ఉండడంలేదని తెలిపారు. రోహిత్ కోలుకోవడానికి మరో రెండు మ్యాచ్‌లు పట్టే అవకాశం ఉందని హార్దిక్ అన్నారు. అలాగే మిచెల్ సాంట్నర్ అస్వస్థత కారణంగా తప్పుకోగా, క్వింటన్ డి కాక్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌తో మయాంక్ రావత్ ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నాడు. గత మ్యాచ్‌ల్లో భారీగా పరుగులు సమర్పించుకున్న బౌలింగ్ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పాండ్యా పేర్కొన్నాడు.

Best 5G Smartphones Under Rs 20,000: బెస్ట్ కెమెరా ఫీచర్స్, బిగ్ బ్యాటరీ ఫీచర్స్ తో రూ. 20,000లోపు 5G స్మార్ట్‌ఫోన్స్ ఇదిగో..!

ముంబై ఇండియన్స్ (MI) Playing XI:
క్వింటన్ డి కాక్ (కీపర్), రియాన్ రికెల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, మయాంక్ రావత్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.

పంజాబ్ కింగ్స్ (PBKS) Playing XI:
ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (కీపర్), కూపర్ కానలీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్‌కుమార్ వైశాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.