Reading Time: 2 minutes
Jasprit Bumrah Struggles Ipl 2026 No Wickets Analysis Fatigue Workload Batsmen Strategy

Jasprit Bumrah IPL 2026 Struggles: టీ20 వరల్డ్ కప్ 2026లో ఆధిపత్యం చేలాయించాడు బుమ్రా. 14 వికెట్లతో 2026 టీ20 ప్రపంచకప్ మొత్తంలోనే అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్‌గా నిరూపించుకున్న జస్ప్రీత్ బుమ్రా ఒక్కసారిగా చెతికిలపడ్డాడు. ఐపీఎల్‌2026లో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్‌లు సైతం అంచనా వేయలేని యార్కర్లు వేసిన అదే బుమ్రా, ఈ సీజన్‌లో వికెట్లు తీయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఒకప్పుడు యార్కర్ కింగ్ బంతుల్లో ఉన్న పదును, నిర్ణయాత్మక ప్రభావం ఇప్పుడు కొరవడినట్లు కనిపిస్తోంది. ఈ మార్పు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ సీజన్‌లో ఆడిన నాలుగు మ్యాచుల్లో 15 ఓవర్లు వేశాడు. 123 పరుగులు సమర్పించుకున్నాడు. 8.20 ఎకానమీ రేటుతో కొనసాగుతున్నాడు. ఇక్కడ ఆందోళన కలిగించే అంశం ఏంటంటే.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఓ చర్చ జోరందుకుంది. వికెట్లు తీయడంలో దిట్ట అని పేరున్న బుమ్రా ‘వికెట్ టచ్’ ఎందుకు కోల్పోయారు? బ్యాటర్లు ఆయన బౌలింగ్ కోడ్‌ను క్రాక్ చేశారా? అనే ప్రశ్నలు ఇప్పుడు మొదలయ్యాయి. టీ20 వరల్డ్ కప్‌లోని 8 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి, కేవలం 6.21 ఎకానమీతో అద్భుత ఫామ్‌లో ఉన్న బుమ్రా, ఐపీఎల్‌కు వచ్చేసరికి ఎందుకు సాధారణ బౌలర్‌లా మారడానికి మూడు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.

READ MORE: SRH vs RR: కాటేరమ్మకొడుకుల దెబ్బకు అల్లాడిన రాజస్థాన్.. ఐపీఎల్ చరిత్రలోనే దారుణమైన రికార్డ్

అలసట (Fatigue): అంతర్జాతీయ, లీగ్ క్రికెట్ మధ్య బుమ్రాకు తగినంత విశ్రాంతి లభించడం లేదు. బుమ్రా విభిన్నమైన బౌలింగ్ యాక్షన్ వల్ల శరీరంపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి బౌలర్లు రెస్ట్ లేకుండా ఆడితే దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అసలట బంతుల ఖచ్చితత్వంపై ప్రభావం చూపుతోంది.

వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్: పనిభారం నిర్వహణ అనేది కేవలం మ్యాచ్‌ల సంఖ్యకే పరిమితం కాదు. ఇందులో ఓవర్ల తీవ్రత, డెత్ ఓవర్ల ఒత్తిడి, నిలకడగా అధిక తీవ్రతతో బౌలింగ్ చేయడం వంటివి కూడా ఉంటాయి. బుమ్రాకు తరచుగా జట్టులోని అత్యంత కష్టమైన ఓవర్లు (పవర్‌ప్లే, డెత్) ఇస్తారు. దీనివల్ల ప్రతి మ్యాచ్‌లో అతని శరీరం, మనసు రెండూ తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయి. దీనిని సరైన పద్ధతిలో బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల ప్రదర్శన దెబ్బతింటోంది.

బ్యాటర్ల సన్నద్ధత: నేటి టీ20 బ్యాటర్లు డేటా అనలిటిక్స్ సాయంతో బౌలర్ల బలహీనతలను ముందే పసిగడుతున్నారు. బుమ్రా యార్కర్ల నుంచి తప్పించుకోవడానికి బ్యాటర్లు కొత్త టెక్నిక్స్‌ను వాడుతున్నారు. ఇదే సమయంలో బుమ్రా తన బౌలింగ్ శైలిలో మార్పులు (Micro-adjustments) చేయడంలో వెనుకబడి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముంబై ఇండియన్స్ జట్టుకు బుమ్రా ఫామ్ ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. డెత్ ఓవర్లలో పరుగులను కట్టడి చేయాల్సిన ప్రధాన ఆయుధమే మొరాయించడంతో కెప్టెన్‌కు ‘ప్లాన్ బి’ అమలు చేయడం కష్టతరమవుతోంది. విపక్ష జట్టు బ్యాటర్లు ఇప్పుడు బుమ్రా ఓవర్లలో కూడా స్వేచ్ఛగా పరుగులు సాధిస్తున్నారు. అయితే, బుమ్రా వంటి లెజెండరీ బౌలర్లకు ఇలాంటి గడ్డు కాలం రావడం కొత్తేమీ కాదు. గాయాల నుంచి కోలుకుని మరీ అద్భుత ప్రదర్శన చేసిన చరిత్ర ఆయనది. ఇది కేవలం ఒక తాత్కాలిక దశ మాత్రమేనని, ఒక్క వికెట్ పడితే బుమ్రా మళ్ళీ తన పాత లయను అందుకుంటాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.