Reading Time: < 1 minute
Pm Modi Apologizes Newlyweds West Bengal Wedding Campaign Video Viral

పశ్చిమ బెంగాల్‌లో నూతన వధూవరులకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పారు. అసౌకర్యాన్ని కలిగించినందుకు క్షమాపణ చెప్పడంతో అతిథులు ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రచారంలో భాగంగా సిలిగురిలో మోడీ పర్యటించారు. అయితే మేఫెయిర్ టీ రిసార్ట్‌లో ఒక పెళ్లి జరుగుతోంది. అదే సమయంలో మోడీ పర్యటన ఉంది. దీంతో పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. దీంతో వివాహ వేడుకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని గమనించిన ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగారు. నేరుగా నూతన వధూవరుల దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పారు. తన పర్యటన కారణంగా పెళ్లికి అంతరాయం కలిగించినందుకు క్షమించాలని కోరారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇదొక చిన్న విషయమే కావచ్చు. కానీ ప్రతి పౌరుడి విశేష ఘట్టాలను గౌరవించి.. వాటికి విలువనిచ్చే నాయకుడి గొప్పతనాన్ని ఎంతో బలంగా చాటిచెబుతుందని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి: Kejriwal vs Judge: ఆర్ఎస్ఎస్ జడ్జ్‌లు న్యాయం చేయలేరు.. జస్టిస్‌పై కేజ్రీవాల్ ఆరోపణలు వైరల్

పశ్చిమ బెంగాల్‌లో రెండు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడత ఏప్రిల్ 23న, రెండో విడత ఏప్రిల్ 29న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 2021లో జరిగిన ఎన్నికల పోరులో తృణమూల్ కాంగ్రెస్ (TMC) 213 సీట్లతో భారీ విజయాన్ని అందుకుంది. బీజేపీ 77 సీట్లు గెలుచుకుంది. ప్రస్తుతం కూడా రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.