
ఐపిఎల్ గుజరాత్ టైటాన్స్ తొలి విజయాన్ని అందుకుంది. బుధవారం చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో గుజరాత్ ఒక పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ఈ సీజన్‌లో గుజరాత్‌కు ఇదే తొలి గెలుపు కాగా, ఢిల్లీ మొదటి ఓటమిని చవిచూసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 45 బంతుల్లో 5 సిక్స్‌లు, 4 ఫోర్లతో 70 పరుగులు చేశాడు.
ధాటిగా ఆడిన జోస్ బట్లర్ 27 బంతుల్లోనే 5 సిక్సర్లు, 3 ఫోర్లతో 52 పరుగులు సాధించాడు. వాషింగ్టన్ సుందర్ (55) పరుగులు చేసి తనవంతు పాత్ర పోషించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఓపెనర్లు పాథుమ్ నిసాంకా (41), కెఎల్ రాహుల్ (92) అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచినా ఫలితం లేకుండా పోయింది.