
అమరావతి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ ప్రేమజంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అన్యోనంగా దంపతులు నివసిస్తున్నారు. దంపతులపై విధి కన్నుకుట్టిందో ఏమో కానీ మేస్త్రీ పని చేస్తుండగా భర్త భవనం పైనుంచి కిందపడి మృతి చెందాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణం శుకబ్రహ్మశ్రమంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కెవిబిపురం మండలం ఆదరం గ్రామానికి చెందిన వినోద్(32), మనీషా(28) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు మగ పిల్లలు జన్మించారు. ఇద్దరు పిల్లలు స్కూల్‌కు వెళ్తుండగా భర్త మేస్త్రీపని చేస్తుండగా మనీషా అతడికి సహాయకురాలిగా పని చేస్తుంది. మంగళవారం ఐదో అంతస్తు ప్లాస్లరింగ్ చేస్తుండగా మధ్యాహ్నం భోజనానికి రమ్మని భర్తకు భార్య చెప్పింది. కొంచెం మేర పూత పూస్తే పని అయిపోతుందని చెప్పారు. వినోద్ నిలబడిన కర్ర విరిగిపోవడంతో అక్కడి నుంచి అతడు కిందపడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఒక్కసారిగా భార్య గుండెపగిలినట్టు అయిపోయింది. భర్త చనిపోవడంతో తల్లడిలిపోయింది.