
మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై రా ష్ట్ర హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. పిసి ఘోస్ కమిషన్ నివేదిక ను సవాల్ చేస్తూ హైకోర్టులో మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ సిఎస్ ఎస్‌కే జోషి, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వేరువేరుగా హై కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కమిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ, సదరు క మిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని, నివేదికను రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. వీటిపై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్లు, ప్రభుత్వం తరుపు న్యాయవాదుల సుదీర్ఘ వాదనలు పరిగణలోకి తీసుకుని తుది తీర్పును వాయిదా వేసింది.
ఈ క్రమంలో కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించబోతుండటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుండగా, పి సి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఒకవేళ కోర్టు నివేదికను సమర్థిస్తే పిటిషనర్లకు ఇబ్బందులు తప్పవు. ఒ కవేళ నివేదికలో లోపాలు ఉన్నాయని కోర్టు భావిస్తే, అది విచారణ ప్రక్రియ, త దుపరి చర్యలకు పెద్ద అడ్డంకిగా మారవచ్చు. ఈ క్రమంలో నేడు వెలువడనున్న తీర్పు కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదిక భవితవ్యాన్ని, దీనితో సంబంధం ఉన్న కీలక నేతల రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది.