
ఈ వారం (ఆగస్టు 9–15) గ్రహాల పరంగా కీలక మార్పులు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ వారంలో కర్కాటక రాశిలోనే సూర్యుడు, బుధుడు, గురుడు సంచరించడం వలన త్రిగ్రాహి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. మేషం నుంచి మీనం వరకు పన్నెండు రాశులపై దీని ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. మరి ఈ వారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . !
మేష రాశి: ఈ రాశి వారికి ఈ వారం ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. గతంలో నిలిచిపోయిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. గ్రహాల శుభ దృష్టి వలన ఈ రాశి వారికి అదృష్టం కలిసి వచ్చి కొన్ని కొత్త పనులకు శ్రీకారం చుట్టడానికి ఈవారం చాలా అనుకూలమైన సమయమని పండితులు చెబుతున్నారు. ఎవరి మాటలు వినవద్దు.. ప్రతి పనిలో కూడా ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. ముఖ్యమైన కార్యక్రమాలను సాఫీగా పూర్తి. సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. వ్యాపారస్తులకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.
వృషభ రాశి: ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా బాగుంటుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల అండదండలు ఉంటాయి. భవిష్యత్తు కోసం వేసే ప్రణాళికలు సఫలమవుతాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. అవసరాలకు ఊహించని విధంగా డబ్బు అందుతుంది. వ్యాపారులకు విస్తరణ కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు. ప్రేమ.. పెళ్లి విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మిథునరాశి : ఈ వారం ఈరాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి.ఆర్థిక ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. డబ్బు లావాదేవీలకు సంబందించి జాగ్రత్తగా ఉండటం చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు సామాన్య ఫలితాలుంటాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. వీరు చేపట్టిన వ్యవహారాలలో మొదట్లో కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ఖర్చులు పెరగడంతో రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలను కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో పూర్తి చేస్తారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. కుటుంబసభ్యుల సహకారం పూర్తిగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుంచి అవార్డులు అందుకుంటారు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెడితే ఆశించిన లాభాలు కలుగుతాయి. వ్యాపారాల విషయాల్లో ఊహించని లాభాలు కలుగుతాయి. బంధువుల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. గతంలో ఉన్న ఆర్ధిక సమస్యలు పరిష్కారమవుతాయి. డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
సింహరాశి: ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రతి పని విషయం లో కూడా శ్రమపడాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకు పని భారం పెరడడం.. స్థాన చలనం వంటివి జరిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందడంలో కొన్ని ఇబ్బందులు పడతారు. విశ్రాంతి లోపించడంతో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల విషయాల్లో తల దూర్చకపోవడం చాలా మంచిది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను ఎట్టి పరిస్థితిలో అనుకోవద్దని పండితులు చెబుతున్నారు. ప్రేమ జీవితం ఉత్సాహంగా సాగిపోతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కన్యా రాశి: ఈ రాశి వారికి ఈ వారం శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి.. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారస్తులు అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వారు తీసుకొనే నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇంట్లొ కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ప్రశంశలు లభిస్తాయి. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెడితే చాలా మంచి లాభాలు వస్తాయి. కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.
తులా రాశి: ఈ రాశి వారికి ఈ వారం అదృష్ట యోగం పడుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఊహించని విధంగా ధన లాభం కలుగుతుంది. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి..వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గతంలో ఉన్న ఫైనాన్స్ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులు ఆశించిన శుభవార్తలు వింటారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మంచి పరిచయాలు కలుగుతాయి. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగిపోతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తిని కొనుగోలుచేసే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈ వారం చాలా అప్రమత్తంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోండి. కీలక నిర్ణయాల విషయంలో వాయిదా వేయడం చాలా మంచిది. ఉద్యోగస్తులు అనవసరంగా మాట పడతారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తోటివారితో వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రతి విషయంలో ఓర్పు సహనం పాటించండి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడుడులు పెట్టకపోవడమే మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
ధనస్సురాశి: ఈ రాశి వారు ఈ వారం రిస్క్ తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. ప్రతి పరి కూడా ఆలస్యంగా పూర్తవుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశాలున్నాయి. వృత్తి .. ఉద్యోగాల్లో పనిభారం పెరగడంతో పాటు కీలక బాధ్యతలు పోషించాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు మీ ప్రమేయం లేకుండానే అవమానాలు పొందుతారు. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. వారం చివరిలో కొంత ఉపశమనం కలుగుతుంది.
మకరరాశి : ఈ రాశి వారికి ఈ వారంలో వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం కూడా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. ముఖ్యమైన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిత్రుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
కుంభరాశి: ఈ రాశి వారికి ఈ వారంలో వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితం కూడా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. ముఖ్యమైన పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిత్రుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
మీనరాశి: ఈ రాశి వారు ఈ వారం ప్రతి విషయంలోనూ శ్రద్ధ తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు, . రోజువారీ కార్యకలాపాల్లో చిన్నచిన్న ఆటంకాలు తలెత్తుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచి.ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆస్తుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.