Reading Time: 2 minutes
ఫ్యామిలీ కోసం ఈవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఏథర్‌‌ కోనార్క్‌ ధర తెలిస్తే పిచ్చెక్కిపోద్ది

కొత్తగా రూపొందించిన ఈఎల్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా వస్తున్న‘కోనార్క్’ స్కూటర్ తొలిసారి ఎలక్ట్రిక్ వాహనం కొనాలనుకునే వారికి అద్భుతమైన ఎంపికగా నిలనుంది. ఆకర్షణీయమైన ఫీచర్లు, అంచనా ధరలతో మార్కెట్లో సంచలనం సృష్టించనున్న ఈ ట్రెండింగ్ ఈవీ పూర్తి వివరాలను తెలుసుకుందాం!

తక్కువ ధరలో..

ఇండియన్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లోకి ఏథర్ ఎనర్జీ మరో కొత్త స్కూటర్‌ను తీసుకురావడానికి రెడీ అయ్యింది. ఈ సరసమైన ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ‘కోనార్క్’ అనే పేరును ఖరారు చేసింది. ఈ కొత్త స్కూటర్‌ను ఆగస్టు 29న జరిగే ఏథర్ కమ్యూనిటీ డే కార్యక్రమంలో ఆవిష్కరించనుంది. ఈ స్కూటర్‌ను ఏథర్ పూర్తిగా కొత్తగా రూపొందించిన ఈఎల్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా డెవలప్ చేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌పై భవిష్యత్తులో మరిన్ని ఎలక్ట్రిక్ టూ-వీలర్లను తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ధర విషయానికి వస్తే కోనార్క్ బేస్ వేరియంట్ సుమారు రూ. 1 లక్ష ఉంటుందని ఆటో నిపుణులు భావిస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏథర్ 450 సిరీస్, రిజ్టా మోడళ్ల కంటే ఇది తక్కువ ధరలో అందుబాటులోకి రానుంది. దీంతో తొలిసారి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ కానుంది. ఏథర్ గత ఏడాది కమ్యూనిటీ డే కార్యక్రమంలో ఈఎల్‌01 కాన్సెప్ట్ పేరుతో ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు అదే కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకుని కోనార్క్‌ను ప్రొడక్షన్ వెర్షన్‌గా తీసుకొస్తోంది. కంపెనీ విడుదల చేసిన టీజర్‌ను చూస్తే, కాన్సెప్ట్ మోడల్‌లో కనిపించిన డిజైన్‌ను అలాగే కొనసాగించినట్లు తెలుస్తోంది.

కొత్త ఈఎల్ ప్లాట్‌ఫామ్ ప్రత్యేకత ఏమిటంటే, దీని మీద పలు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసే అవకాశం ఉంది. ఇందులో 2 కేడబ్ల్యూహెచ్ నుంచి 5 కేడబ్ల్యూహెచ్ వరకు సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్‌లను అమర్చవచ్చు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులో వేర్వేరు బ్యాటరీ ఎంపికలతో కొత్త మోడళ్లను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

డిజైన్, ఫీచర్లు

డిజైన్ పరంగా చూస్తే, కోనార్క్‌లో 14 అంగుళాల ఫ్రంట్ వీల్, 12 అంగుళాల రియర్ వీల్ ఉండే అవకాశం ఉంది. బ్రేకింగ్ కోసం ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ అందించవచ్చని సమాచారం. ఈ సెటప్ రోజువారీ నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఫీచర్ల విషయంలో కూడా ఏథర్ ఎలాంటి రాజీ పడే అవకాశం కనిపించడం లేదు. ఈ స్కూటర్‌లో 7 అంగుళాల టీఎఫ్‌టీ డిజిటల్ డిస్‌ప్లే ఇవ్వనున్నట్లు అంచనా. దీనికి స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఉండటంతో పాటు నావిగేషన్, రైడ్ వివరాలు, వెహికల్ సమాచారం, సాఫ్ట్‌వేర్ ఆధారిత కనెక్టెడ్ ఫీచర్లు లాంటి సౌకర్యాలు కూడా లభించే అవకాశం ఉంది.

అంతేకాకుండా, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్, పొడవైన సీటు, కుటుంబ అవసరాలకు ఉపయోగపడే స్టోరేజ్ స్పేస్ లాంటి ఫీచర్లు కూడా ఇందులో ఉండొచ్చని తెలుస్తోంది. మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఏథర్ కోనార్క్‌కు గట్టి పోటీ ఉండనుంది. ముఖ్యంగా టీవీఎస్ ఆర్బిటర్, ఓలా ఎస్1ఎక్స్ సిరీస్, హీరో విడా వీఎక్స్2, బజాజ్ చేతక్ లాంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో నేరుగా పోటీ పడే అవకాశం ఉంది. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు కోరుకునే కుటుంబాలకు ఈ కొత్త స్కూటర్ చక్కటి ప్రత్యామ్నాయంగా మారుతుంది. ఆటోమొబైల్ రంగంలో సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తున్న ఏథర్ సంస్థ ఈ కొత్త లాంచ్‌తో మరింత మంది వినియోగదారులను ఆకట్టుకోవడం ఖాయం.