Reading Time: < 1 minute

హైదరాబాద్: మైనింగ్, ఇసుక తవ్వకాలపై సిబిసిఐడి విచారణకు సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు శాసనసభలో ఆయన ప్రకటన చేశారు. ‘‘సిరిసిల్ల, నేరెళ్ల ఇసుక మాఫియాపై విచారణ జరిపిస్తాం. సంతోష్ రావు, ఆయన తండ్రి రవీందర్ రావుపై, గంగుల కమలాకర్ అక్రమ గ్రానైట్ మైనింగ్, వద్దిరాజు రవిచంద్ర కంపెనీ అక్రమ మైనింగ్‌పై, రాఘవ కన్స్‌స్ట్రక్షన్‌తో పాటు అన్నింటిపై సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నాం’’ అని సిఎం అన్నారు.

విచారణలో నిజాలు నిగ్గు తేల్చి శాసనసభలో నివేదిక పెడతామని స్పష్టం చేశారు. ‘‘అక్రమాలకు పాల్పడింది బిఆర్ఎస్ నేతలు, వారి బంధువులే. వద్దిరాజు రవిచంద్ర వంటివారిని బెదిరించి దారిలోకి తెచ్చుకున్నారు. స్వయంగా హరీశ్ రావు తమ్ముడు మహేశ్వర్‌రావు ఇసుక మాఫియా నడిపారు. అతడి అక్రమాల వల్లే కెటిఆర్ మైనింగ్ శాఖ తీసుకున్నారు’’ అని సిఎం పేర్కొన్నారు.