
కంటోన్మెంట్ బోయిన్ పల్లి మెయిన్ సెంటర్ పాయింట్ వద్ద అగ్ని భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కళ్లద్దాల దుకాణంలో చెలరేగిన మంటలకు.. దట్టమైన పొగలు కమ్ముకుని భయానక పరిస్థితులు కనిపించాయి. సడెన్ షాక్ షార్ట్ సర్క్యూట్ తో ఆ ప్రాంతం అంతా పొగలతో నిండిపోయింది. మంటల తీవ్రత పెరుగుతుండటంతో షాపులు మూసేసి పరుగులు తీశారు జనం.
శనివారం ( మార్చి 28) కళ్లద్దాల షాపులు షాక్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఫైర్, పోలీసులకు వెంటనే సమాచారం అందించారు స్థానిక వ్యాపారులు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. చాలా సేపు శ్రమించి మంటలను ఆర్పాల్సి వచ్చింది. ప్రమాద సమయంలో షాపులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు త్వరలో బయటపెతామని అన్నారు.