Reading Time: < 1 minute

ఈ ఏడాది ఆరంభంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు మాస్ మహారాజ రవితేజ. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప దీక్షలో కనిపించనున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భక్తితో పాటు తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని కూడా చూపించనున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా శ్రీరామ నవమి సందర్భంగా ఓ ప్రత్యేక పోస్టర్‌ని విడుదల చేసింది. చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో రవితేజ తన కూతురితో కలిసి.. నడుచుకుంటూ వెళ్లడం మనం చూడొచ్చు. దీన్ని పట్టి ఈ సినిమాలో తండ్రీ కూతుళ్ల మధ్య ఎమోషనల్ సీన్స్ చాలానే ఉంటాయని అర్థమవుతోంది. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. జివి ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది.