Reading Time: < 1 minute

చాక్లెట్స్, క్యాండీస్, గమ్మీస్ తింటున్నారా..? హైదరాబాద్లో భారీగా కల్తీ స్టాక్ స్వాధీనం

Caption of Image.

పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా చప్పరించే చిరుతిండ్లు కాన్ఫెక్షనరీ ఐటెమ్స్. అంటే స్వీట్ షుగర్ రిచ్ ఫుడ్స్. వీటికి బెస్ట్ ఉదాహరణ  చాక్లెట్స్, క్యాండీస్, గమ్మీస్ లాంటి ఐటెమ్స్. చిన్న కిల్లీ కొట్టు నుంచి హైపర్ మార్కెట్ వరకు ఎక్కడైనా దొరికే ఈ ఐటెమ్స్ బాగా కల్తీ చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. 2026  మార్చి 25న హైదరాబాద్ లోని పలు తయారీ కేంద్రాలు, స్టోర్ లలో నిర్వహించిన తనిఖీల్లో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.

కాన్ఫెక్షనరీ ఐటమ్స్‌ పై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు  18 సంస్థల్లో తనిఖీలు నిర్వహించారు. 38 కాన్ఫెక్షనరీ నమూనాలు సేకరించి నాచారం స్టేట్ ఫుడ్ ల్యాబ్‌కు తరలించారు. భారీగా కల్తీ జరుగుతుందన్న అనుమానంతో పరీక్షలు నిర్వహించారు. కొన్ని సంస్థలు నిబంధనలు పాటించకుండా కల్తీ చేస్తున్నట్లు  గుర్తించారు.

Also Read ; ఇప్పసారాపై అసెంబ్లీలో గందరగోళం.. ఇందిరమ్మ పేరు తీసిన బీజేపీ.. కాంగ్రెస్ గరంగరం !

తయారీలో హైజీన్, శానిటేషన్ పాటించని సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు పంపించారు అధికారులు. FSSAI నిబంధనలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు హెచ్చరికలు జారీ చేశారు. కాటేదాన్‌ లోని M/s Rolex Confectionary కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 25 కిలోల కాన్ఫెక్షనరీ స్టాక్ స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ & లేబులింగ్ నిబంధనలు ఉల్లంఘన కారణంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.