
న్యూఢిల్లీ: ఐపీఎల్ 2026 నుండి ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ బెన్ డకెట్ తప్పుకున్నాడు. కేఎల్ రాహుల్‌తో పాటు డకెట్ ఓపెనర్ గా ఎంపికవుతాడని భావించారు. అయితే, టోర్నమెంట్‌కు కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కు డకెట్ షాకిచ్చాడు.రాబోయే సీజన్‌లో తాను ఆడటం లేదని డకెట్ అధికారికంగా ప్రకటించాడు. ఇప్పుడు తన ఏకైక లక్ష్యం జాతీయ జట్టు కోసం రాణించడమేనని తెలిపాడు.
“ఇది చాలా కష్టమైన నిర్ణయం. నేను రాలేకపోతున్నందుకు ఢిల్లీలోని ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. నేను వేలంలో పాల్గొన్నప్పుడు ఇది ఒక గొప్ప అవకాశంగా భావించాను. ఢిల్లీ లాంటి ఫ్రాంచైజీ నన్ను ఎంపిక చేసుకోవడం అద్భుతంగా అనిపించింది. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన అత్యుత్తమ పోటీ. ఈ టోర్నీ ఒక అద్భుతమైన అనుభవం అయ్యేది” అని డకెట్ పేర్కొన్నాడు. అయితే, యాక్షన్‌లో ఎంపికైన తర్వాత టోర్నీ నుంచి తప్పుకునే ప్లేయర్లను బ్యాన్ చేయాలని గతేడాది బిసిసిఐ కొత్త రూల్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో డకెట్ పై రెండేళ్ల నిషేధం పడే అవకాశం ఉంది.