Reading Time: < 1 minute

తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భారీగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు మంగళవారం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి కృష్ణ తాజ్ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల నుంచి 15 గంటల సమయం పడుతుంది.

ఇక, సోమవారం తిరుమల వెంకన్నను 81,483 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 30,777 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.12 కోట్లుగా ఉన్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.