Reading Time: < 1 minute

జైపూర్: ప్రభుత్వ ఉపాధ్యాయుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడితో కలిసి భర్తను భార్య గొంతు నులిమి చంపింది.ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రం బలోత్రా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. మేఘ్వాల్ గ్రామానికి చెందిన మహేంద్ర కుమార్, బగుండి ప్రాంతానికి చెందిన అను దేవితో పెళ్లి జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అమరారామ్‌తో అను దేవి అక్రమ సంబంధం పెట్టుకుంది. వివాహం జరిగినప్పటి నుంచి అను దేవి, మహేంద్ర కుమార్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పెద్దలు దంపతులకు నచ్చజెప్పారు. వాళ్లలో మార్పు మాత్రం రాలేదు. అత్తగారింటికి వచ్చిన తరువాత తన ప్రియుడు అమరారామ్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. భర్త గాఢనిద్రలోనికి జారుకున్న తరువాత గదిలో ప్రియుడిని పిలిచింది. ఇద్దరు కలిసి భర్త గొంతునులిమి హత్య చేశారు. ఉదయం మహేంద్ర నిద్ర నుంచి లేవకపోవడంతో కుమారుడిని లేపటానికి ప్రయత్నించింది. అతడు అచేతనంగ పడిఉండడంతో పాటు గొంతుపై రక్తపు మరకలు ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి భార్యను అనుదేవిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలు బయటకు వచ్చాయి. భార్యతో అమరారామ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.