Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఎ1గా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఎ2గా ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరును చేర్చింది. అలాగే ఎ3గా హెచ్‌ఎండిఎ మాజీ చీఫ్ ఇంజినీర్ బిఎల్‌ఎన్ రెడ్డి, ఎ4గా స్పోర్ట్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఎ5గా యుకెకు చెందిన ఎఫ్‌ఇఒ కంపెనీని పే ర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు మళ్లించినట్లు ఎసిబి ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హ యాంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా -ఈ రేసింగ్ కోసం దాదాపు రూ.55 కోట్ల

ప్రభుత్వ నిధులను నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థల కు బదిలీ చేశారనేది ప్రధాన ఆరోపణ. క్యాబినెట్ అనుమతి లేకుండానే నిధులు విడుదల చేయడం. ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా విదేశీ కరెన్సీలో చె ల్లింపులు జరపడం, ఎన్నికల కోడ్ అమలులో ఉ న్న సమయంలో నిధులు బదిలీ చేయడం వంటి అంశాలపై ఎసిబి కేసు నమోదు చేసింది. ఫార్ము లా ఈ రేసు పూర్వాపరాలు, అనుమతి లేకుండానే హెచ్‌ఎండిఎ ఒప్పందం చేసుకోవడం, ఆర్‌బిఐ అ నుమతి లేకుండా విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఫిర్యాదు మేరకు ఎసిబి కేసు నమోదు చేసి పలుమార్లు విచారణ చేసిన సంగతి తెలిసిందే.