
వాషింగ్టన్: ఇజ్రాయెల్ తో కిలసి ఇరాన్‌పై దాడుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ తో జరుగుతున్న యుద్ధానికి బ్రేక్ వేస్తున్నట్లు వెల్లడించారు. ఇరాన్‌పై తాత్కాలికంగా దాడులు ఆపేస్తున్నామని సోమవారం ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా ప్రకటించారు. గత రెండు రోజులుగా ఇరాన్‌తో జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్ తో చర్చలు జరుగుతున్నాయని.. రాబోయే ఐదు రోజులపాటు ఇరాన్‌పై దాడులకు ఆపేస్తామని చెప్పారు. టెహ్రాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను వాయిదా వేయాలని తమ సైన్యాన్ని ఆదేశించినట్లు ట్రంప్ పేర్కొన్నారు.