Reading Time: < 1 minute

అమరావతి: మటన్ ఉడక లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగింది. ఉగాది సందర్భంగా సోడాల హాజీ అనే వ్యక్తి కిలో మేక తలకాయ కొనుగోలు చేశాడు. ఇంటికెళ్లిన తరువాత కుక్కర్ లో వేసి ఉడికించాడు. 20 సార్లు ఉడికించినా ఉడకకపోవడంతో మటన్ గిన్నెతో పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. మటన్ అమ్మిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరాడు. పోలీసులు అతడికి సర్ది చెప్పి పంపించారు. అనంతరం హాజీ మటన్ అమ్మిన వ్యక్తి దగ్గరికి వెళ్లి గొడవకు దిగాడు. తన గిరాకీకి ఎసరు పెట్టేటట్లు ఉన్నాడని తల కాయ కూరకు బదులుగా కిలో మటన్ ఇచ్చి అతడిని మాంసపు వ్యాపారి పంపించాడు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.