Reading Time: < 1 minute

ఐపిఎల్ 2026 మినీ-వేలంలో అన్ సోల్డ్ గా మిగిలిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు స్వస్తిక్ చికారా, అయోధ్య ప్రీమియర్ లీగ్‌లో పెను విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్ లో గోమతి థండర్ తరఫున ప్రియాంశు పాండేతో కలిసి చికారా ఓపెనర్ గా బరిలోకి దిగాడు. వీరిద్దరూ భారీ షాట్లతో ఊచకోత కోశారు. ముఖ్యంగా చికారా ఆకాశే హద్దుగా చెలరేగిపోయాడు. దీంతో కేవలం 69 బంతుల్లో  21 సిక్సర్లు, 11 బౌండరీలతో అజేయంగా 195 పరుగులు సాధించాడు. పాండే 54 బంతుల్లో 100 పరుగులతో (12 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయంగా నిలిచాడు.

ఓపెనర్లు ఇద్దరు సెంచరీలతో చెలరేగడంతో గోమతి థండర్.. 20 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 307 పరుగుల రికార్డు స్కోరును నమోదు చేసింది. అనంతరం టైటాన్స్ జట్టు 218 పరుగులకే ఆలౌట్ అయింది. శేఖర్ సిరోహి 33 బంతుల్లో 68 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. థండర్ బౌలర్లలో రితిక్ శ్రీవాస్తవ(3/51), అరవింద్ర వర్మ(3/26), ఆతిఫ్ సాజిద్(2/13)లు రాణించారు.

కాగా, స్వస్తిక్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్రాతినిధ్యం వహించినా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 2026 వేలానికి ముందు స్వస్తిక్ ను ఆర్సిబి విడుదల చేసింది. మినీ వేలంగా అతనిని కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి చూపించకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలాడు.