
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న మూవీ ‘బైకర్’. ఇందులో శర్వా సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుంది. సీనియర్ హీరో రాజశేఖర్ ఇందులో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, సాంగ్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రేసింగ్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ యువి క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్ద మొదటి పూర్తి మోటోక్రాస్ డ్రామాగా రూపొందుతున్న సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది.