Reading Time: < 1 minute

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ హత్యకు గురైంది. ఫరూక్ నగర్ మండలం రంగారెడ్డిగూడకు చెందిన శోభ (31) అనే మహిళ మృతి చెందింది. భర్తతో గొడవపడి మూడేళ్లుగా తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. మహబూబ్ నగర్ కు చెందిన నర్సింహులతో రెండేళ్లుగా సహజీవనం చేస్తుంది. కొంతకాలంగా నర్సింహులు, శోభకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. వీరిద్దరి వివాదం జరిగిన అనంతరం తిరిగి రంగారెడ్డిగూడాలోని తల్లివద్దకు శోభ వచ్చింది. నర్సింహులు కుమారుడికి సైకిల్ కొని ఇస్తానని నర్సింహులు శోభకు ఫోన్ చేసి షాద్ నగర్ కు రావాలన్నాడు. ఎంతసేపు ఎదురు చూసినా రాకపోవడంతో కుటుంబసభ్యులకు శోభ సమాచారమిచ్చింది. అకస్మాత్తుగా ఇవాళ ఉదయం రంగారెడ్డిగూడ గ్రామ శివారులో శోభ మృతదేహం కనిపించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.