
లండన్: ఇంగ్లండ్ జట్టు ప్రధాన కోచ్ మెక్‌కలమ్ సంచలనన ఆరోపణలు ఎదురుకుంటున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లోకి సిగిరెట్లు, మద్యం తీసుకొచ్చారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. యాషెస్ సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సమీక్షలో.. అతడు బాధ్యతరాహిత్యంగా వ్యవహరించినట్లు వెల్లడైంది. యాషెస్ సిరీస్‌లో మధ్యలో తొమ్మిది రోజులు విరామం రావడంతో ఆరు రోజులు ఆటగాళ్లు మద్యం తాగుగూ బయటే గడిపారని తెలుస్తోంది. కివిస్‌తో సిరీస్ సమయంలో న్యూజిలాండ్‌లో అర్థరాత్రి నైట్‌క్లబ్ బౌన్సర్‌తో బ్రూక్ వాగ్వాదానికి దిగడం దూమారం రేపింది. కొందరు ఆటగాళ్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. కెప్టెన్ బెన్ స్టోక్స్‌తోనూ మెక్‌కలమ్ విబేధాలు తలెత్తాయని, అతను కూడా కోచ్ తీరును తప్పుబట్టాడని సమాచరం. అయితే ఇంత జరిగినా.. స్టోక్స్‌తో మెక్‌కలమ్‌కు సయోధ్య కుదిర్చి, అన్ని ఫార్మాట్లకు అతడినే కోచ్‌గా కొనసాగించాలని ఇంగ్లండ్ బోర్డు నిర్ణయించడం గమనార్హం.