Reading Time: < 1 minute

ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘కల్కి 2898ఎఢి’. ఈ సినిమా సీక్వెల్ కోసం సినీ ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ప్రభాస్ లేకుండానే కొన్ని సీన్స్‌ని తెరకెక్కిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్‌తో భాగమైన సీన్స్‌ని చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ మూవీలో మరో స్టార్ హీరో భాగమయ్యాడని తెలుస్తోంది.

హైదరాబాద్‌లో కొనసాగుతున్న కల్కి-2 షూటింగ్ సెట్స్‌లోకి ప్రముఖ హీరో జె.డి.చక్రవర్తి కూడా ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ మూవీలో ఆయన ప్రధానమైన పాత్రలో కనిపించనున్నారట. అతి త్వరలో ప్రభాస్ కూడా ఈ సెట్స్‌లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రం నుంచి ఇప్పటికే దీపికా పదుకొనే తప్పుకున్న విషయం తెలిసిందే. ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ని తీసుకోనున్నారు.