
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. మూసీ ప్రక్షాళనకు బిజెపి వ్యతిరేకం కాదు అన్నారు. మూసీ పునర్జీవం – అంశంపై బిజెపి చర్చా కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రామచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మూసీ నదిపై బిజెపి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీ ఒడ్డున ఓ బిల్డర్ పెద్ద ఎత్తున నిర్మాణాలు చేస్తున్నారని, అక్రమాలు తొలగించడంలో పేదవారికి అన్యాయం జరుగుతుందని రామచందర్ రావు విమర్శించారు. అలా అని పేదల ఇళ్లు కూల్చితే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. హామీల అమలుకే నిధులు లేవంటున్నారని, మరి మూసీకి ఎక్కడి నుండి వస్తామని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టుపై ప్రజలకు సరైన వివరణ ఇవ్వాలని రామచందర్ రావు సూచించారు.