Reading Time: < 1 minute

హైదరాబాద్: తమ పాలనలో రైతే రాజని మరోసారి రుజువు చేస్తూ పథకాన్నిఅమలు చేస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నానని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు, 70 లక్షల మంది రైతన్నలకు భరోసా ఇస్తున్నామని తెలియజేశారు. రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నామని, కేవలం 17 నెలల వ్యవధిలో ఆయిల్ పామ్ పరిశ్రమ మొదలు పెట్టామని అన్నారు. ఆయిల్ పామ్ పరిశ్రమను పూర్తి చేసి నేడు రైతులకు అంకితం చేస్తున్నామని, పరిశ్రమకు కొనసాగింపుగా రిపైనరీ యూనిట్ కు శంకుస్థాపన చేస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.