Reading Time: < 1 minute

అమరావతి: ఆంధ్రరాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిలో ప్రయాణం చేస్తుండగా.. రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. నలుగురుకి గాయాలవ్వడంతో క్షతగాత్రులను గోదావరి గోపాలపురం సిహెచ్ సి ఆస్పత్రికి తరలించగా..వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.