Reading Time: < 1 minute

అమెరికాలో మనీ లాండరింగ్‌కు సంబంధించిన కేసులో భారత సంతతికి చెందిన ఓ న్యాయమూర్తి దోషిగా తేలారు. నిధుల దుర్వినియోగం ఆరోపణలతో ఆయనపై నమోదైన అభియోగాలు నిర్ధారణ అయ్యాయి. ఈమేరకు జ్యూరీ తీర్పు వెలువరించింది. శిక్ష మాత్రం జూన్ 16న ఖరారు చేయనుంది. అక్కడి చట్టాలను అనుసరించి ఆయనకు రెండు నుంచి పదేళ్లవరకు జైలు శిక్ష, పదివేల డాలర్లు జరిమానా పడే అవకాశం ఉన్నట్టు సమాచారం. భారత సంతతికి చెందిన కేపీ జార్జ్ టెక్సాస్ లోని ఫోర్ట్ బెండ్ కౌంటీ న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ప్రచార నిధులు దాదాపు 46 వేల డాలర్లు తన వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్టు అభియోగాలు నమోదయ్యాయి. కోర్టు రూమ్ నుంచే ఆయనను అధికారులు అదుపు లోకి తీసుకోగా, స్థానిక జైలు నుంచి పూచీకత్తుపై బయటకు వచ్చారు.