
బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తన చిన్ననాటి స్నేహితుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మ హమ్మద్ జహంగీర్, మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, ఇతర ముస్లింలతో రంజాన్ వేడుక లు జరుపుకున్నారు. శనివారం ఎర్రవెల్లి నివాసం లో హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, మ హమ్మద్ జహంగీర్‌తో పాటు బిఆర్‌ఎస్ రాష్ట్ర నా యకుడు జుబేర్ మహమ్మద్ తదితరులు మర్యాద పూర్వకంగా కలిశారు. మహమూద్ అలీ ముని మనుమడిని కెసిఆర్ ప్రత్యేకంగా ఆశీర్వదించా రు. ఈ సందర్భంగా కెసిఆర్ వారితో ఫొటోలు ది గి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీలో వారు కెసిఆర్‌కు సంప్రదాయ ఇస్లాం టోపీని బహూకరించగా, ఆయన దానిని ధరించారు. కొద్దిసేపే వారితో కలిసి స్నేహపూర్వకంగా పం డుగ సంతోషాన్ని పంచుకున్నారు.