
ఓ ప్రేమ పెళ్లి ప్రాణాల మీదికి తెచ్చింది. వివాహం జరిగినప్పటి నుంచి కోపంతో అమ్మాయి వాళ్ళ బాబాయ్ సమయం కోసం ఎదురు చూసి తేదీ మార్చి18 బుధవారం రాత్రి 8:00 గంటల సమయంలో అబ్బాయిని ఇనుప రాడ్డులతో విచక్షణ రహితంగా చితకబాదరు. పైగా బండ బూతులు తిడుతూ నిన్ను చంపేస్తాను అని భయభ్రాంతులకు గురి చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని చితకబాదారు అమ్మాయి తరఫు బంధువులు ఈ ఘటన వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండలం గంగ్యడ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో బాధితున్నీ అతని అన్న బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. శివకుమార్ శరీరం నుంచి రక్తం బాగా పోయింది. సమయానికి ఆస్పత్రికి తరలించడంతో వైద్యులు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. మొత్తంగా ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసీ దర్యాప్తు చేస్తున్న నవపేట్ పోలీసులు