Reading Time: < 1 minute

భువనేశ్వర్: ఆరుగురు ఎమ్మెల్యేలపై బిజు జనతా దళ్ (BJD) పార్టీ వేటు వేసింది. ఇటీవల ఒడిశా నుండి నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికలలో ‘క్రాస్-ఓటింగ్’కు పాల్పడ్డారని శనివారం ఆరుగురు ఎమ్మెల్యేలను బిజెడి, పార్టీ నుండి సస్పెండ్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఈ పార్టీ, సదరు ఎమ్మెల్యేలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకే తమ నిర్ణయానికి కారణమని పేర్కొంది. పార్టీ క్రమశిక్షణా కమిటీ జరిపిన పరిశీలన ఆధారంగానే ఈ సస్పెన్షన్లు విధించినట్లు BJD ప్రకటనలో తెలిపింది.

కాగా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP), గత సోమవారం పోలింగ్ జరిగిన ఒడిశాలోని నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండింటిని కైవసం చేసుకుంది. కాషాయ పార్టీ మద్దతుతో పోటీ చేసిన మరో స్వతంత్ర అభ్యర్థి కూడా విజయం సాధించారు. మిగిలిన ఒక స్థానాన్ని పట్నాయక్ నేతృత్వంలోని BJD దక్కించుకుంది.