
తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం సిఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ.. భారతీయ జనతా పార్టీ(బిజెపి)కి బీ టీమ్ లాంటి వాడని సంచలన ఆరోపణలు చేశారు.
రాహుల్ గాంధీ అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోవడానికి ఇష్టపడని వ్యక్తి అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. మెజారిటీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన మతతత్వ శక్తుల మద్దతును కూడగట్టుకోవడమే ఆ పార్టీ లక్ష్యమని విజయన్ ఆరోపించారు. CPI(M), LDF మతతత్వానికి పూర్తిగా వ్యతిరేకమని చెప్పారు. కాగా, కేరళలో ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.