
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభం కావడానికి ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుని గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే హర్షిత్ రాణా జట్టుకు దూరమయ్యాడు. తాజాగా కెకెఆర్‌కు మరో షాక్ తగిలింది. గత వేలంలో తీసుకున్న ఆకాశ్‌దీప్ కూడా లీగ్‌లో ఆడటం కష్టమేనని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఆకాశ్‌దీప్ బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీలో చికిత్స పొందుతున్నాడు. ఐపిఎల్ ప్రారంభానికి కొద్ది రోజుల సమయమే ఉండటంతో అతడు ఈ లీగ్‌లో పాల్గొనడం కష్టమేనని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఆకాశ్‌కు గాయాలు కొత్తేమీ కాదు. 2022లో తొలిసారి ఐపిఎల్‌లో అడుగుపెట్టిన అతడు.. ఇప్పటివరకూ కేవలం 14 మ్యాచులు మాత్రమే ఆడాడు. గత సీజన్ వేలంలో ఆకాశ్‌ను కెకెఆర్ రూ.కోటికి సొంతం చేసుకుంది. అయితే హర్షిత్ రాణా గైర్హాజరీలో ఎవరిని జట్టులోకి తీసుకుంటారనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కెకెఆర్ కోచ్ అభిషేక్ నాయర్ అన్నారు. ఆకాశ్ దీప్‌కి ప్రత్యామ్నాయం గురించి మాత్రం ఆయన మాట్లాడలేదు.