Reading Time: 2 minutes
Moinabad Drugs Case Twist Sit Uncovers New Links Key Accused Under Scanner

Moinabad Drugs Case Twist: మోయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నిందితులకి నుంచి కీలక వివరాలు రాబట్టింది ప్రత్యేక బృందం (SIT). అయితే ఈ ముగ్గురు నిందుతులని కస్టడీలోకి తీసుకొని మరింత ప్రశ్నించాలని భావిస్తోంది బృందం. మోయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక సమాచారం రాబట్టే పనిలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నిమగ్నమైంది. ఈ కేసులో ఏడుగురు నిందితులను ఇప్పటికే సుదీర్ఘంగా ప్రశ్నించింది సిట్. వారి నుంచి పలు ముఖ్యమైన విషయాలు రాబట్టింది. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి..? ఎవరి ద్వారా వచ్చాయి..? అనే వివరాలు తెలుసుకునే పనిలో పడింది సిట్.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ – ట్రావెల్స్ బస్సు ఢీ.. 15 మందికి గాయాలు..!

డ్రగ్స్ కేసులో కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, శ్రవణ్ కుమార్, శరత్ లను సుదీర్ఘంగా ప్రశ్నించింది సిట్. ముఖ్యంగా డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చారనే దానిపై ఆరా తీసింది. దీంతో కౌశిక్ రవి తనకు డ్రగ్స్ ఇచ్చాడని స్టేట్మెంట్ ఇచ్చారు శరత్. అలాగే డ్రగ్స్ ను సిమ్లా నుంచి తీసుకొచ్చానని కౌశిక్ రవి చెప్పినట్లు తెలుస్తుంది. కానీ దర్యాప్తులో మాత్రం హైదరాబాద్ లోనే డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ వ్యవహారంలో లోతుగా దర్యాప్తు చేయాలనే నిర్ణయానికి వచ్చింది సిట్. మొయినాబాద్ ఫార్మ్ హౌస్ పై పోలీసులు రైట్ చేసినప్పుడు ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందని సిట్ ఆరాస్తోంది.

Human Trafficking: మానవ అక్రమ రవాణా బండారం బట్టబయలు.. ఒక్కో మహిళకు రూ. 2.5 లక్షల చొప్పున అమ్మకాలు..!

ఈ కేసులో నిందితుల నుంచి పూర్తి సమాచారం సేకరించాలని నిర్ణయించింది సిట్ దీనిలో భాగంగా ముగ్గురిని 10 రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకొని ప్రశ్నించాలని భావిస్తోంది. ఈ మేరకు కోర్టులో పిటిషన్ వేగా విచారణ జరిగింది. తీర్పును సోమవారానికి వాయిదా వేసింది రాజేంద్రనగర్ కోర్టు. మరోవైపు డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీస్ కి వివరణ ఇచ్చారు ఏలూరు ఎంపి పుట్టా మహేష్. మరో ఐదు రోజుల్లో సమాధానం ఇవ్వాలన్న నోటీస్ గడువు ముగుస్తున్న తరుణంలో సమాధానం ఇచ్చారు ఆయన. ఈ వివరణను పరిశీలించాక తుది నిర్ణయం తీసుకొనింది టీడీపీ అధినాయకత్వం. మొత్తానికి మొయినాబాద్ ఫార్మ్ హౌస్ కేసు మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.