Reading Time: < 1 minute
Security Lapse At Srisailam Temple Devotee Records Video Inside Sanctum

Security lapse at Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో భద్రతా వైఫల్యం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఉగాది మహోత్సవాల సందర్భంగా గర్భగుడిలో శ్రీస్వామివారిని ఓ భక్తుడు సెల్‌ఫోన్‌లో వీడియో తీయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేవాలయంలో మొబైల్ ఫోన్లు, వీడియో కెమెరాలకు అనుమతి లేకపోయినప్పటికీ, ఒక సామాన్య భక్తుడు వాటిని లోనికి తీసుకెళ్లడం భద్రతా లోపాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. వీడియో తీసిన వ్యక్తి కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తుడిగా గుర్తించినట్లు సమాచారం. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన దేవస్థానం అధికారులు, సంబంధిత భక్తుడిపై కేసు నమోదు చేసే యోచనలో ఉన్నారు. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ నియమాలను ఉల్లంఘించడం పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also: MP Putta Mahesh Clarifies: ఎంపీ పుట్టా మహేష్‌ వివరణ.. ఇప్పుడు టెస్ట్‌ చేసుకున్నా నేను సిద్ధమే..

మరోవైపు, శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. భ్రమరాంబ దేవి నిజరూప అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే అశ్వవాహనంపై శ్రీస్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిదంపతుల ఆలయ ప్రదక్షిణ కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. ఈ రోజుతో శ్రీశైలం ఉగాది మహోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. మొత్తం మీద, ఒకవైపు వైభవంగా జరిగిన ఉత్సవాలు, మరోవైపు భద్రతా లోపం.. ఈ రెండు అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.