Reading Time: < 1 minute
Anirudh Xv Tour Hyderabad Concert Traffic Parking Guidelines

సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ‘రాక్‌స్టార్’ అనిరుధ్ రవిచందర్ ప్రయాణం మొదలై 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న “XV – 15 ఇయర్స్ విత్ యూ” టూర్ ఇప్పుడు భాగ్యనగరానికి చేరుకుంది. రేపు (మార్చి 21, శనివారం) గచ్చిబౌలి అవుట్‌డోర్ స్టేడియంలో జరగబోయే ఈ కన్సర్ట్ కోసం నగరం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. వేలాదిగా తరలివచ్చే అభిమానుల దృష్ట్యా, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, పార్కింగ్‌లో గందరగోళం లేకుండా ఉండేందుకు నిర్వాహక సంస్థలు ‘బ్రాండ్ అవతార్’, ‘ట్రైబ్‌వైబ్’, ‘ఓషన్ వైబ్స్’ కలిసి పలు కీలక మార్గదర్శకాలను విడుదల చేశాయి. కన్సర్ట్ హడావుడి లేకుండా సాఫీగా సాగాలంటే అభిమానులు ముందుగానే రావాలని నిర్వాహకులు కోరుతున్నారు. గేట్లను సాయంత్రం 4:30 గంటలకు ఓపెన్ చేస్తామని సాయంత్రం 6:00 గంటలకు షో ప్రారంభిస్తామని వెల్లడించారు.

Also Read:Mahesh Babu: వారణాసి తర్వాత మహేశ్‌ నటించే సినిమా ఏంటి?

ఈసారి పార్కింగ్ సౌకర్యాన్ని టికెట్ రకాన్ని బట్టి వేర్వేరు ప్రాంతాల్లో కేటాయించారు. మీ టికెట్‌కు అనుగుణంగా సరైన చోట వాహనాన్ని పార్క్ చేయాల్సి ఉంటుంది. బోల్డర్ హిల్స్ పార్కింగ్ లో సిల్వర్ & గోల్డ్ టికెట్ హోల్డర్లుకి బైక్‌లకు పార్కింగ్ ఉంది. ఇక్కడి నుండి స్టేడియానికి వెళ్లేందుకు పరిమిత సంఖ్యలో షటిల్ సర్వీస్ బస్సులు ఉంటాయి. ప్రవేశం గేట్ 1 మరియు గేట్ 4 ద్వారా ఉండనుంది. ఇక సంధ్యా కన్వెన్షన్ పార్కింగ్లో (ఫ్యాన్ పిట్ హోల్డర్లు కేవలం కార్లకు మాత్రమే పరిమితం కానుంది. ఇక్కడ కూడా షటిల్ సర్వీస్ సౌకర్యం ఉంది. గచ్చిబౌలి స్టేడియం పార్కింగ్ (రాక్‌స్టార్ ఫ్యాన్ పిట్ హోల్డర్లకి, కేవలం రాక్‌స్టార్ ఫ్యాన్ పిట్ కేటగిరీ వారికి మాత్రమే ఇక్కడ అనుమతి ఉంటుంది. భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నందున, సొంత వాహనాల కంటే క్యాబ్‌లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లేదా కార్‌పూలింగ్ ఉపయోగించడం ఉత్తమమని నిర్వాహకులు సూచిస్తున్నారు.