Reading Time: < 1 minute

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. సంఘ వ్యతిరేక కార్యక్రమాలను నిలువరించడంలో పోలీస్ శాఖ మంచి ఫలితాలును కనబరుస్తొందని కొనియాడారు. ఈ క్రమంలో హోం శాఖ కు బడ్జెట్‌లో రూ. 11, 907 కోట్లను కేటాయించారు. గతేడాది హోం శాఖకు రూ. 10,181 కోట్లు కేటాయించగా, ఈ సారి రూ.1,726 కోట్లు అధికంగా కేటాయించారు. ప్రసంగంలో భట్టి మావోయిస్టుల లొంగుబాట్లపై మాట్లాడుతూ నక్సలిజం పుట్టుకకు కారణమైన ఫ్యూడలిస్టిక్ సామాజిక, ఆర్థిక అసమానతులను రూపుమాపడం ద్వారానే నక్సలిజం ఉద్యమం అంతం అవుతుందన్నారు. సమగ్ర సంక్షేమం, ఉపాధి ద్వారానే నిజమైన మార్పు సాధ్యమని తెలంగాణ నిరూపించిందని, ఈ విధానంలో మనం దేశానికే మార్గదర్శకంగా మారామని భట్టి అన్నారు. గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నక్సలిజాన్ని శాంతి-భద్రతల సమస్యగానే చూశాయని, ఈ క్రమంలో నక్సలిజాన్ని అణిచివేడానికి పోలీస్, సైనిక బలగాలను ఉపయోగించాయన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సమస్య మూలాలను విశ్లేషించి యువతకు సరైన జీవనోపాధి, సామాజిక గౌరవం, ఆర్థిక భరోసా అడవుల్లోకి వెళ్లిన వాళ్లు సైతం ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలుస్తారనే సామాజిక ఆర్థిక వాస్తవాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2023 వరకు 347 మంది మావోయిస్టులు లొంగిపోతే 2023 డిసెంబర్ 7 నుంచి 2026 మార్చి 8వ తేదీ వరకు 732 మంది వివిధ స్థాయి క్యాడర్ మావోయిస్టులు లొంగిపోయినట్లు చెప్పారు. సత్వర న్యాయం, సమ న్యాయం అనే లక్షంతో న్యాయశాఖను బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు డిప్యూటి సిఎం వెల్లడించారు. రాష్ట్ర హైకోర్టు భవనాలను, న్యాయమూర్తుల నివాస గృహాలను రూ. 2,583 కోట్లతో అధునాతన వసతులతో నిర్మిస్తున్నామని, ఇప్పటికు 11 అదనపు జిల్లా న్యాయ స్థానాలు, రెండు సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానాలు, 46 జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానాలను నిర్మించిడానికి అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. వీటి కోసం బడ్జెట్‌లో రూ. 2,367 కోట్లు కేటాయించినట్లు డిప్యూటి సిఎం చెప్పారు.