Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో చి న్న, మధ్యతరహా, ఇతర వినియోగదారుల కు రాష్ట్రాలకు బొగ్గు కేటాయింపు విషయం లో కేంద్ర ఆదేశాలిచ్చింది. రాష్ట్రాలకు అధిక పరిమాణంలో బొగ్గును కేటాయించాలని కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్ వంటి సంస్థలకు బొగ్గు మంత్రిత్వశాఖ ఇప్పటికే ఆ దేశాలు ఇచ్చిందని అధికారులు తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్ కట్టడి చేయాలని, 31 రా ష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని, జిల్లా స్థాయిలో పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు కేంద్ర సూచనలు చేసింది.

గ్లోబల్ సంక్షోభం కారణంగా గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్న తరుణంలో భారత ప్రభుత్వం వినియోగదారులకు కీలక సూచనలు చేసింది. గ్యాస్ వినియోగదారులు ఎల్‌పిజి నుంచి పిఎన్‌జి గ్యాస్‌కు మారాలని ప్రభుత్వం ప్రకటించింది. 15కోట్లకు పైగా పిఎన్‌జి వినియోగదారులు, లక్షల మంది అర్హులుగా ఉన్నందున ప్రభుత్వం కనెక్షన్లను వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టింది. అదే సమయంలో బొగ్గు, కిరోసిన్ ఇంధనాలను కూడా అం దించడం ద్వారా ఎల్‌పిజి డిమాండ్ ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.