Reading Time: 2 minutes
Iran Intelligence Minister Killed In Israeli Airstrike

ఇరాన్ టాప్ లీడర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ దూసుకెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. గత నెల 28న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు కీలక నేతలను అంతమొందించగా.. నిన్నటికి నిన్న ఖమేనీకి కుడిభజంగా ఉన్న ఇరాన్‌ అత్యున్నత సైనికాధికారి అలీ లారిజానీ, ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ అనుబంధ బసీజ్‌ మిలీషియా అధిపతి జనరల్‌ సోలేమానీని హతమార్చగా.. తాజాగా మరొక కీలక నేతను చంపేసింది. ఐడీఎఫ్‌ చేపట్టిన వైమానిక దాడుల్లో ఇరాన్‌ నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్‌ ఖాతిబ్‌ హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దీంతో ఇరాన్ కీలక నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ పని చేస్తున్నట్లుగా అర్ధమవుతోంది.

ఇది కూడా చదవండి: Mallikarjun Kharge: దేవెగౌడపై ఖర్గే పంచ్‌లు.. నవ్వులు చిందించిన మోడీ

గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కుటుంబ సభ్యులు, కీలక ప్రభుత్వ పెద్దలు హతమయ్యారు. ఈ ఘటనలో ఖమేనీ కుమారుడు మోజ్తాబా కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఇంతలోనే ఇరాన్ కీలక నేతలను టార్గెట్‌గా పెట్టుకుని ఇజ్రాయెల్ హతమార్చుతోంది. ఇక ఈ దాడులను రష్యా ఖండించింది.

ఇదిలా ఉంటే నిన్న ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన ఇరాన్ భద్రతా అధిపతి అలీ లారిజానీ అంతిమయాత్రకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. పెద్ద ఎత్తున నివాళులర్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Russia-India: ఉగాది వేళ భారత్‌కు శుభపరిణామం.. నడిసంద్రంలో చైనాకు రష్యా ట్యాంకర్ షాక్