Reading Time: < 1 minute
Ysrcp Iftar Dinner In Vijayawada Former Cm Ys Jagan To Attend Ramadan Event

పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు బుధవారం వైఎస్సార్‌సీపీ ఇఫ్తార్‌ విందు నిర్వహించనుంది. విజయవాడలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్‌లో ఇఫ్తార్ విందును వైసీపీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం సామరస్యానికి, సాంప్రదాయాలకు ప్రతీకగా జరగనుంది. ఈ ఇఫ్తార్ విందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరుకానున్నారు. ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణలో పాల్గొని, వారికి శుభాకాంక్షలు తెలియజేయనున్నారు.

Also Read: Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో డబ్బే డబ్బు!

రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రేమ, శాంతి, సోదరభావాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం ఉండనుంది. వైఎస్ జగన్ సాయంత్రం 6 గంటలకు విజయవాడకు చేరుకుని ఇఫ్తార్‌ విందులో పాల్గొననున్నారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం 7 గంటలకు తాడేపల్లికి తిరుగు ప్రయాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు హాజరుకానున్నారు.