July 11, 2026

Rohit Sharma: ఇంపాక్ట్ ప్లేయర్ గా రోహిత్ శర్మ.. MI కోచ్ ఏమన్నారంటే?

Rohit Sharma: ఇంపాక్ట్ ప్లేయర్ గా రోహిత్ శర్మ.. MI కోచ్ ఏమన్నారంటే?
Reading Time: 2 minutes

Rohit Sharma: ఇంపాక్ట్ ప్లేయర్ గా రోహిత్ శర్మ.. MI కోచ్ ఏమన్నారంటే?

Caption of Image.

Rohit Sharma: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. గత సీజన్‌లో ఎక్కువగా ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా ఉపయోగించిన రోహిత్ శర్మ ఈసారి మైదానంలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని వెల్లడించారు. గత సీజన్‌లో రోహిత్ ని ప్రధానంగా బ్యాటింగ్ సమయంలో మాత్రమే ఉపయోగించారు. ర్యాన్ రికెల్టన్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన రోహిత్, అనంతరం ఎక్కువగా స్టేడియం బయటే కనిపించాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.

గత సీజన్‌లో రోహిత్ ఫిట్‌నెస్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించామని జయవర్ధనే పేర్కొన్నారు. అయినప్పటికీ జట్టుపై అతని ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. ఈసారి మాత్రం అతన్ని ఎక్కువ సమయం మైదానంలో ఉంచాలని భావిస్తున్నామన్నారు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించినప్పుడు అభిమానుల నుంచి కొంత వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. వాంఖడే స్టేడియంలో కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులు హార్దిక్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ అతను ఒత్తిడిని తట్టుకుని జట్టును క్వాలిఫయర్స్‌ వరకు తీసుకెళ్లాడు. 2020 తర్వాత ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు చేరడం ఇదే తొలిసారి.

►ALSO READ | USA vs Iran: ఇరాన్–ఇజ్రాయెల్ టెన్షన్.. ట్రంప్ వార్నింగ్తో ఫీఫా వరల్డ్ కప్ వేదిక మార్పు?

ముంబై ఇండియన్స్ జట్టులో ఆల్‌రౌండర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో కెప్టెన్‌కు బౌలింగ్ ఆప్షన్లు అవసరమవుతున్నాయని కోచ్ జయవర్ధనే తెలిపారు. ఈ కారణంగానే రోహిత్ శర్మ స్వయంగా ఇంపాక్ట్ ప్లేయర్ పాత్రను స్వీకరించాడని చెప్పారు. “తిలక్ వర్మ కూడా ఇప్పుడు బౌలింగ్ చేస్తున్నాడు.. అతన్ని బయటకు ఉంచలేం.. బౌలింగ్ చేయని ఆటగాళ్లు రోహిత్, సూర్యకుమార్ మాత్రమే.. అప్పుడు ఎవరు ఇంపాక్ట్ ప్లేయర్ గా పంపాలనే విషయం చూడాలని పేర్కొన్నారు. ఇక ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ వంటి భారత ఆటగాళ్లతో పాటు క్వింటన్ డీకాక్, ర్యాన్ రికెల్టన్, షెర్ఫేన్ రదర్‌ఫోర్డ్ వంటి విదేశీ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.  

©️ VIL Media Pvt Ltd.