Reading Time: < 1 minute

Good News: యుద్ధం ఎన్నాళ్లు జరిగినా..పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచేది లేదు..!

Caption of Image.

పెట్రోల్, డీజిల్ రేట్లు పెంపుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం ఎన్నాళ్లు జరిగినా పెట్రోల్, డిజిల్ ధరలు మాత్రం పెంచబోమని శుభవార్త చెప్పింది. మిడిల్ ఈస్ట్‎లో వార్ భీకర స్థాయిలో సాగుతున్నప్పటికీ దేశంలో పెట్రోల్, డిజిల్ రేట్లు పెంచాలనే ఆలోచనే తమకు లేదని స్పష్టం చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం దేశంలో సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని.. పెట్రోల్, డిజిల్ రేట్లు పెరుగుతాయంటూ వస్తోన్న వదంతులను నమ్మి ఆందోళనకు గురి కావొద్దని ప్రజలకు సూచించింది.  

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ప్రపంచ దేశాలకు చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసి వేయడంతో గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురు రవాణా ఆగిపోయింది. దీంతో చమురు కోసం గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడ్డ భారత్‎పై కూడా ఈ ప్రభావం పడింది. దీంతో దేశంలో పెట్రోల్, డిజిల్ ధరలు పెరగబోతున్నాయని వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. 

ఈ క్రమంలో పెట్రోల్, డిజిల్ ధరల పెంపుపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ మంగళవారం (మార్చి 17) కీలక ప్రకటన చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలను పెంచబోమని ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వానికి లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు పెట్రోలియం & సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ముడి చమురు సాధారణ స్థాయిలో అందుబాటులో ఉందని తెలిపారు.

►ALSO READ | ఒక్కరోజే 70 లక్షల సిలిండర్ల బుకింగ్స్ ..సాధారణ రోజుల్లో 25 నుంచి 30 లక్షలే

 రిఫైనరీలు గరిష్ట స్థాయిలో పనిచేస్తున్నాయని.. రిటైల్ అవుట్‌లెట్లలో ఎలాంటి చమురు కొరత లేదన్నారు. దేశంలో ముడి చమురు సాధారణ స్థాయిలో అందుబాటులో ఉన్నందున పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వానికి లేదని ఆమె వివరణ ఇచ్చారు. ఇక, ఎల్పీజీ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్, నిల్వలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.

©️ VIL Media Pvt Ltd.