
న్యూఢిల్లీ: లోక్‌సభ నుంచి సస్పెండయిన 8 మంది విపక్ష ఎంపిలపై స్పీకర్ సస్పెన్షన్ ఎత్తివేశారు. దీంతో మంగళవారం సస్పెండ్ అయిన 8 మంది ఎంపీలు ఇవాళ సభా కార్యక్రమాలకు హాజరయ్యారు. సస్పెండైన వారిలో ఏడుగురు కాంగ్రెస్ ఎంపిలు, ఒక సిపిఎం సభ్యుడు ఉన్నారు. బడ్జెట్ తొలి దఫా సమావేశాల్లో సభలో అభ్యంతరకరంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై తెలంగాణ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి సహా 8 మందిపై ఈ సమావేశాలు ముగిసే వరకు అంటే ఏప్రిల్ 2వరకు సభాపతి సస్పెన్షన్ వేటు వేశారు. కొద్ది రోజులుగా వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్‌ను విపక్షాలు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో స్పీకర్.. వారిపై సస్పెన్షన్ ఎత్తివేశారు.