Reading Time: 2 minutes

Sreeleela: క్రేజీ ప్రమోషన్స్తో ఇచ్చిపడేస్తున్న శ్రీలీల.. పవన్ డైలాగ్ టీ షర్ట్‌తో హల్ చల్

Caption of Image.

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌’ (Ustaad Bhagat Singh) విడుదలకు సిద్దమైంది. మార్చి 19న వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్, ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ ద్వారా మేకర్స్ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని సృష్టించారు. ఇక విడుదలకు కేవలం 2 రోజులే మిగిలి ఉండటంతో ఉస్తాద్ టీమ్ ప్రమోషన్స్లో మరింత వేగం పెంచేసారు.

హీరోయిన్ శ్రీలీల (Sreeleela) క్రేజీ ప్రమోషన్స్తో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ ట్రైలర్‌లో వైరల్ అయిన “ఇచ్చి పడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం” డైలాగ్‌ను శ్రీలీల తన టీ షర్ట్ పై ప్రింట్ చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు.

లేటెస్ట్గా ప్రమోషన్స్లో భాగంగా శ్రీలీల తాను ధరించిన టీ షర్ట్పై ఉస్తాద్ డైలాగ్ అచ్చువేయించింది. ‘‘ఇచ్చి పడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం’’ అని శ్రీలీల టీ షర్ట్పై ఉండటంతో పవన్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. శ్రీలీల ఎయిర్ పోర్ట్లో దిగి నడిచొస్తుండగా.. ఫోటోలు క్యాప్చర్ చేయడంతో ఇపుడు వైరల్గా మారాయి. ఈ క్రమంలో రిలీజ్ డే వరకు ప్రమోషన్స్ ఇంకా రసవత్తరంగా కొనసాగనున్నాయి.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ డైలాగ్స్: పవన్, పార్థిబన్ స్పార్క్ హై అంచనాలు..

‘‘వైలెన్స్‌ అంటే మీనింగ్‌ తెలియక మీ అందరికీ ఓ ఫ్యాషన్‌ అయిపోయింది. చూపిస్తా.. అర్థం, భావం, అవసరం.. అన్నీ చూపిస్తా’’ అంటూ పవన్‌ ఇచ్చిన ఎంట్రీ.. చేసిన విధ్వంసం ఫ్యాన్స్ కు విజిల్‌ మూమెంట్‌ లా ఉంది.

అలాగే, ‘‘సంతోషంగా ఉండటమంటే మన జీవితాన్ని మనం లైక్‌ చేయడం. మన జీవితానికి ఎవడెవడో లైకులు కొట్టడం కాదు’’ అని పవన్ చెప్పే డైలాగ్, ‘‘వాడు నీకు భయపడలేదా.. అసలు ఎవడికీ భయపడలేదా’’ అంటూ పార్థిబన్‌ చెప్పే డైలాగ్‌.. ‘‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌.. ఇచ్చి పడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం’’, ‘‘ఈ దేశపు మగవాడు బొట్టుపెడితే ఎలా ఉంటదో చూస్తావా’’ వీటితో పాటుగా ‘ఇందాక విన్నది భగవద్గీత.. ఇది భగత్‌‌‌‌‌‌‌‌ గీత’, ‘‘ఈసారి పెర్ఫార్మెన్స్‌ బద్దలైపోద్ది’’ అంటూ ట్రైలర్‌లో పేలిన ప్రతి డైలాగ్‌ ఉస్తాద్ భగత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌’ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసేలా ఉన్నాయి.

రన్ టైం & ప్లస్ పాయింట్స్

ఈ చిత్రానికి సెన్సారో బోర్డ్ ‘యూ/ఏ’ (U/A) సర్టిఫికేట్‌ను జారీ చేసింది. మొత్తం రన్ టైం 2 గంటల 34 నిమిషాలు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా నటించారు.. అలాగే ఆర్. పార్థిబన్, అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, తమన్ బీజీఎం, దశరథ్ స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన బలాలుగా నిలవనున్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఉస్తాద్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.

©️ VIL Media Pvt Ltd.