Reading Time: < 1 minute

Viswanath and Sons: సూర్య–మమిత ఏజ్ గ్యాప్ రొమాన్స్.. టీజర్లో ఇది గమనిస్తే క్లారిటీ వచ్చినట్టే!

Caption of Image.

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో  సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై  సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మమిత బైజు హీరోయిన్‌‌గా నటిస్తుండగా, రాధిక శరత్‌‌కుమార్, రవీనా టాండన్  కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సోమవారం (March 16) ఈ  మూవీ టీజర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో  సంజయ్ విశ్వనాథ్ అనే అంతర్జాతీయ పిస్టల్ షూటర్ పాత్రలో సూర్య కనిపించాడు. ‘కంటి చూపుకు ఇరవైల్లో ఉన్న ఫిట్‌‌నెస్ నలభై దాటాక ఉండదు’ అనే డైలాగ్‌‌తో ఆయన పాత్రను పరిచయం చేస్తూ.. నలభై  ఏళ్ల వయసులో కూడా తన కలలను వదలకుండా ముందుకు సాగుతూ ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న వ్యక్తిగా ఆయన్ను చూపించిన విధానం ఆకట్టుకుంది.

అలాగే తనను ఇష్టపడే మ్యాడీ పాత్రలో మమిత బైజును ఇంట్రడ్యూస్ చేశారు. ఆమె తనకంటే 20 ఏళ్ల చిన్నది అని తెలిసినా ఇష్టపడుతూ కనిపిస్తుంది. సూర్య మాత్రం తనకు ఇష్టంలేదనే చెబుతుంటాడు. ‘మనం గొప్ప అనుకున్న ప్రతిసారీ మనకన్నా గొప్పోడు ఒకడుంటాడు అని దేవుడు గుర్తుచేస్తాడు..’ అని సూర్య చెప్పే డైలాగ్ ఆలోచింపజేస్తుంది.

ఫైనల్‌‌గా ఒక బాబును ఎత్తుకుని రావడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌‌గ్రౌండ్ స్కోరు మరింత ఎలివేట్ చేసింది. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ చిత్రాన్ని జులైలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 

ఈ మూవీ కథనం చూస్తే, ‘సూర్య–మమిత’ లవ్ స్టోరీలో ఎప్పుడూ వయసు పెద్ద ఆటంకం కాదని అనేలా ఉంది టీజర్. ముఖ్యంగా టీజర్‌లో సూర్య “కంటి చూపుకు ఇరవైల్లో ఉన్న ఫిట్‌నెస్ నలభై దాటాక ఉండదు” అని చెప్పడం, మ్యాడీ పాత్ర 20 ఏళ్ల చిన్నదని చూపడం – ఇది కేవలం వయసుకి సంబంధించిన తేడా మీద కాదు, ప్రతి ఒక్కరి ఫిట్‌నెస్, ఆశయాలు, డెడికేషన్,  స్థిరత్వం, వ్యక్తిగత వికాసం.. ఇవే ముఖ్యమని టీజర్ కన్వే చేస్తోంది.

©️ VIL Media Pvt Ltd.