Reading Time: < 1 minute
India Rejects Uscirf 2026 Report Raw Rss Sanctions

US Report: అమెరికాలోని ‘‘యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్(USCIRF)’’ రిపోర్ట్‌పై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మత స్వేచ్ఛ ఉల్లంఘన పేరుతో భారత్‌ను ‘‘ప్రత్యేక ఆందోళనకరమైన దేశం(కంట్రీ ఆఫ్ పర్టిక్యులర్ కన్సర్న్CPC)’’ జాబితాలో చేర్చాలని, అలాగే భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిస్ వింగ్(R&AW), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS)పై ఆంక్షలు విధించాలని అమెరికా కమిషన్ సూచించింది. అయితే, ఈ నివేదికపై స్పందించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నివేదికను పూర్తిగా పక్షపాతంతో తయారైనదిగా అభివర్ణించారు.

Read Also: Whats App Chat: వాట్సాప్ చాట్ ప్రాణాల మీదకు తెచ్చింది.. ఏఆర్ కానిస్టేబుల్ దారుణ హత్య..

USCIRF చాలా సంవత్సరాలుగా భారత్‌పై చాలా ఏళ్లుగా విషం కక్కుతోందని, ఎంపిక చేసిన సమాచారాన్ని మాత్రమే ప్రదర్శిస్తోందని, ఇది వాస్తవాల కన్నా ఐడియాలజీ ఆధారిత కథనాలపై ఆధారపడుతోందని ఆయన అన్నారు. ఈ తరహా నివేదికలు కమిషన్ విశ్వసనీయతకే నష్టం చేస్తాయని భారత్ పేర్కొంది. భారత్‌ను విమర్శించడం కన్నా అమెరికాలో హిందూ దేశాలయాలపై జరుగుతున్న దాడులు, విధ్వంసాలపై కూడా దృష్టి పెట్టాలని సూచించింది.

USCIRF తన 2026 వార్షిక నివేదికలో (2025 పరిస్థితుల ఆధారంగా) భారత్‌లో మత స్వేచ్ఛ పరిస్థితులు దిగజారుతున్నాయని ఆరోపించింది. మైనారిటీ మతాలపై ప్రభుత్వ విధానాలు ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది. అదే విధంగా అమెరికా ప్రభుత్వం రా, ఆర్ఎస్ఎస్‌లపై లక్ష్యిత ఆంక్షలు విధించాలని సూచించింది. వాటి ఆస్తుల్ని ఫ్రీజ్ చేయడం, అమెరికాలో ప్రవేశాన్ని నిషేధించడం వంటి చేయాలని సూచించింది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ‘‘మతమార్పిడి ’’ చట్టాలను కఠినతరం చేస్తున్నాయని చెప్పింది. దీంతో మైనారిటీలపై ఒత్తిడి పెరుగుతోందని ఆరోపించింది.