
ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్‌గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘సుయోధన‘. వైఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. పలు హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన శ్రీలక్ష్మి పిక్చర్స్ సంస్థ ‘సుయోధన’ సినిమాను విడుదల చేస్తోంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వైఎస్ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా ఈ కథ అనుకున్నాక, ప్రియదర్శిని కలిశాను. స్క్రిప్ట్ విన్న తర్వాత ఆయన ఓకే చెప్పా రు. ‘సుయోధన’ మూవీ అందరినీ ఖచ్చితంగా ఎంటర్‌టైన్ చేస్తుంది’ అని అన్నారు. హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘ఇందులోని ఒక పాయింట్ చాలా కొత్తగా అనిపించింది. ఒక మనిషి సుయోధ న, దుర్యోధన అని ఎందుకు పిలవబడతాడు అనేది ఆసక్తి రేపింది. ద్రిషిక ఈ మూవీలో చాలా బాగా నటించింది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి కుమార్, ద్రిషిక చందర్ , బోసుబాబు నిడుమోలు, చోటా కె ప్రసాద్ నాయుడు పాల్గొన్నారు.