Reading Time: 2 minutes

న్యూఢిల్లీ/టెహ్రాన్: ప్రస్తుత గల్ఫ్ పోరు పరిస్థితుల నడుమ ఇరాన్ శుక్రవారం భారతదేశంతో అత్యంత బలీయ మిత్రత్వం ప్రకటించింది. తమ ఆధీన హర్మూజ్ జలసంధి జల మార్గం మీదుగా భారతీయ చమురు నౌకల రాకపోకలకు అనుమతిని నిర్థారించింది. ఈ మేరకు భారతదేశంలోని ఇరాన్ రాయబారి మెహమ్మద్ ఫతాలీ తమ దేశ నిర్ణయాన్ని వె లువరించారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భారదేశం తమ మిత్రదేశం అ ని, ఇది చిరకాల బంధం అని, భారతీయ నౌ కలకు అనుమతి ఉందని, పర్షియన్ గల్ఫ్ ఉ ద్రిక్తతలతో నిమిత్తం లేకుండా ఈ సాఫీ ప్ర యాణం సాగుతుంది. ఇందులో ఇరాన్ నుం చి ఎటువంటి ఇబ్బందులు భారత్‌కు తలెత్తకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ భరోసాతో ఇప్పుడు ఇక ఈ జలసంధి ద్వారా నిలిచిపోయిన భారతీయ నౌకలు సు రక్షితంగా తమ గమ్యాలకు చేరుకోవచ్చునని ప్రకటించారు. ఇప్పుడు అయితే ఈ జలమార్గంలో దాదాపు 77వరకూ భారతీయ నౌక లు ఉన్నాయి.

ప్రస్తుతం  ఈ జలమార్గం సంక్షుభిత, ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితిలో ఉంది. సురక్షితంగా భారతీయ నౌకలు ప్రయాణించేందుకు అంగీకారం కుదిరింది. కొద్దిరోజుల్లోనే దీనికి సంబంధించిన ప్రక్రియ, ఏ విధంగా భారతీయ నౌకలను తీసుకువెళ్లాల్సి ఉంటుందనేది ఖరారు చేసుకుంటారని వివరించారు. బారత్ తమకు మిత్రదేశం. రెండు మూడు గంటల్లోనే దీని వల్ల జరిగే సత్ఫలితం ఏ విధంగా ఉంటుందనేది మీరే చూస్తారని ఆయన విలేకరులకు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇండియా, ఇరాన్‌లకు ఉమ్మడి సారూప్య ప్రయోజనకర అంశాలు ఇమిడి ఉన్నాయి. ఈ కోణంలోనే తమ దేశం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. పరస్పర సహకారం , స్నేహం ప్రాతిపదికన ఇరుదేశాల బంధం చిరకాలంగా ఉందన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఇరాన్‌కు భారతదేశం అందించిన మద్దతు తాము మరువజాలమని పేర్కొన్నారు.

హర్మూజ్ జలసంధి మార్గం ద్వారా భారతదేశానికి రెండు ఎల్‌పిజి ట్యాంకర్లు బయలుదేరి రానున్నాయి. ఈ మేరకు ఈ భారతీయ నౌకలకు ఇరాన్ అధికారికంగా అనుమతిని వెలువరించింది. ఈ జలసంధి మార్గం గుండా భారతీయ చమురు నౌకల రవాణాకు వీలు కల్పించినట్లు ఇరాన్ రాయబారి మెహమ్మద్ ఫతాలీ శుక్రవారం ప్రకటించారు. భారత్‌కు ఈ భరోసా కల్పించిన కొద్ది గంటల్లోనే ఈ రెండు ఎల్‌పిజి నౌకల కదలికలకు ఇరాన్ నుంచి అనుమతి రావడం కీలక పరిణామం అయింది. దీనితో ఈ మార్గం నుంచి సంబంధిత వంటగ్యాసు ట్యాంకర్ల నౌకలు వెంటనే బయలుదేరనున్నాయి. బారతదేశంలో నెలకొంటున్న వంటగ్యాసు కొరత కొంత మేర తగ్గేందుకు ఈ నౌకల రాక అత్యంత ఉపయుక్తం కానుంది. ఈ మార్గంలో భారత్‌కు ఈ నౌకలు ఎటువంటి చిక్కులు లేకుండా ఇరాన్ తగు చర్యలను చేపడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఈ ట్యాంకర్ నౌకలలో ఏ స్థాయిలో సిలిండర్లు ఉన్నాయనేది వెల్లడికాలేదు.