
న్యూఢిల్లీ: మహిళా ఉద్యోగులకు ‘నెలసరి’ సెలవుల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తం గా మహిళలకు, విద్యార్థినులకు వేతనంతో కూడిన నెలస రి సెలవు అమలు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై విచారణ జరిపిన సిజెఐ నేతృత్వంలో ధర్మాసనం శుక్రవారంనాడు దానిని తిరస్కరించింది. సె లవును తప్పనిసరి చేస్తే మహిళల కెరీర్ ముగుస్తుందన్నారు. వేతనం తో కూడిన నెలసరి సెలవు అంశంలో పలు అభ్యంతరాలు ఉన్నాయ ని సిజెఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. నెలసరి సెలవులు ఇస్తే మ హిళలను ఉద్యోగాల్లో తీసుకునేందుకు యాజమాన్యాలు వెనుకంజ వేసే ప్రమాదం ఉందని అన్నారు. తద్వారా వారి ఉపాధిపై ప్రతికూ ల ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. వాలంటరీగా సెలవు లు ఇవ్వడమనేది చెప్పుకోవడానికి బాగుటుంది కానీ చట్టం చేసి తప్పనిసరి చేస్తే వివిధ రంగాల్లోని ఉద్యోగాల భర్తీలో కూడా వాళ్లకు ప్రతికూలతలు ఉంటాయన్నారు. అదే విధంగా పురుషుల కన్నా తాము త క్కువ అనే భయ భావన వారిలో కలిగే అవకాశముందన్నారు. నెలసరి వల్ల ఏదో చెడు జరుగుతోంది అన్న విషయాన్ని వ్యాప్తి చేయడం మంచిది కాదని, అది మహిళలను ఆత్మనూన్యతకు గురిచేసేలా ఉంటుందని సిజెఐ అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వాలు స్టేక్‌హోల్డర్లతో చర్చించి నెలసరి సెలవు విధానాన్ని రూపొందించే అంశాన్ని పరిశీలించాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.