Reading Time: < 1 minute

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2026 షెడ్యూల్‌ను భారతక్రికెట్‌బోర్డు (బిసిసిఐ) బుధవారం విడుదల చేసింది. మొదటి విడతలో 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించారు. మార్చి 28 నుంచి ఈ టోర్నీ జరుగనుంది. ఆరంభ మ్యాచ్‌లోడిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్‌తో మాజీ విజేత సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనుంది. మొదటి విడతలో హైదరాబాద్‌కు ఒక మ్యాచ్‌ను కేటాయించారు.

ఏప్రిల్ 5న లక్నో సూపర్ జెయింట్స్‌తో హైదరాబాద్ ఆడనుంది. మొదటి విడత షెడ్యూల్‌లో హైదరాబాద్ నాలుగు మ్యాచులు ఆడుతోంది. ఒక మ్యాచ్ సొంత మైదానంలో జరుగుతుండగా మిగతా పోటీలు ఇతర వేదికల్లో నిర్వహిస్తున్నారు. కాగా, ఆయా రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయి షెడ్యూల్‌ను విడుదల చేయలేదు. మార్చి 29న జరిగే రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. హైదరాబాద్ తొలి విడత షెడ్యూల్‌లో బెంగళూరు, కోల్‌కతా, లక్నో, పంజాబ్ జట్లను ఎదుర్కొనుంది. బెంగళూరు, ముంబై, గౌహతి, ముల్లాన్‌పూర్, లక్నో, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్‌లలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. కాగా, ఈ సీజన్‌లో మొత్తం పది జట్లు పోటీ పడనున్నాయి.